Karnataka: క‌ర్ణాట‌క‌లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాలు బంద్‌.. కార‌ణ‌మిదే!

Karnataka Tea Coffee Milk Sales Stopped Due to GST Protests
  • జీఎస్‌టీ నోటీసుల‌కు వ్య‌తిరేకంగా చిరు వ్యాపారుల నిర‌స‌న‌లు
  • బేక‌రీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాల‌ను నిలిపివేత‌
  • ఇప్ప‌టికే యూపీఐ చెల్లింపుల‌ను నిలిపివేసిన చాలా మంది వ్యాపారులు
క‌ర్ణాట‌క‌లో జీఎస్‌టీ నోటీసుల‌కు వ్య‌తిరేకంగా చిరు వ్యాపారులు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలుపుతున్నారు. బేక‌రీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మ‌కాల‌ను నిలిపివేశారు. నిర‌స‌న‌కు గుర్తుగా కేవ‌లం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్ర‌మే అందుబాటులో ఉంచారు. ఇప్ప‌టికే చాలా మంది వ్యాపారులు యూపీఐ చెల్లింపుల‌ను నిలిపివేశారు. కేవ‌లం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్ర‌మే చేస్తున్నారు. 

జీఎస్‌టీ అధికారులు త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఆందోళ‌న చేప‌డుతున్నారు.  జీఎస్‌టీ విభాగం నోటీసుల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే.. త‌మ ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉద్ధృతం చేస్తామ‌ని వ్యాపారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క స‌ర్కార్ స్పందించింది. చిరువ్యాపారుల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించేందుకు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు త‌న ఇంట్లోనే సీఎం సిద్ధ‌రామ‌య్య భేటీ కానున్నారు. 

కాగా, 2021 నుంచి 2024 ఆర్థిక సంవ‌త్స‌రాల మ‌ధ్య జ‌రిగిన యూపీఐ, డిజిట‌ల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్‌టీ విభాగం ఈ డ్రైవ్ చేప‌డుతోంది. దీని కింద‌ ఆన్‌లైన్ పేమెంట్ల విలువ రూ. 20ల‌క్ష‌లు (సేవ‌లు), రూ. 40ల‌క్ష‌లు (వ‌స్తువులు) దాటిన వ్యాపారుల‌కు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.  
Karnataka
GST
Karnataka GST
Siddaramaiah
Karnataka government
UPI payments
digital payments
tax
Karnataka protest
black tea

More Telugu News