Karuppu: సూర్య బర్త్‌డే స్పెషల్‌.. ‘కరుప్పు’ టీజర్

Suriya Karuppu Teaser Released on Birthday
  • ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా 'కరుప్పు' 
  • క‌థానాయిక‌గా సీనియ‌ర్ న‌టి త్రిష‌
  • నేడు సూర్య బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు టీజ‌ర్‌తో ట్రీట్ ఇచ్చిన మేక‌ర్స్‌
సూర్య త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో. ఆయన చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకి కూడా బాగానే క‌నెక్ట్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తున్నారు. అలాగే తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో 'కరుప్పు' అనే సినిమా కూడా చేస్తున్నారు. 

నేడు సూర్య బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో సూర్య తన ప్రత్యేక వింటేజ్ లుక్‌లో కనిపించి ఆక‌ట్టుకున్నారు. టీజ‌ర్‌లో "నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు కూడా ఉంది", "ఇది మన టైమ్" వంటి డైలాగ్స్ బాగున్నాయి. 'జై భీమ్' తర్వాత మళ్లీ సూర్య న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ బాణీలు అందిస్తున్నారు. సీనియ‌ర్ నటి త్రిష కథానాయికగా నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి, త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. 



Karuppu
Suriya
Suriya Karuppu
RJ Balaji
Sai Abhyankar
Trisha
Tamil Movie
Telugu audience
Dream Warrior Pictures
Jai Bhim

More Telugu News