Mohammad Nabi: అఫ్ఘాన్ టీ20 మ్యాచ్ లో తండ్రీకొడుకులు.. ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన కొడుకు.. వీడియో ఇదిగో!

Mohammad Nabi faces son Hasan Eisakhil in T20 match
  • కొడుకుతో కలిసి ఆడుతున్న అఫ్ఘాన్ ఆల్ రౌండర్
  • స్పాగేజా క్రికెట్ లీగ్ లో ప్రత్యర్థులుగా మొహమ్మద్ నబీ, హసన్‌ ఐసాఖిల్‌
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అఫ్ఘనిస్థాన్ క్రికెట్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. టీ20 టోర్నమెంట్ లో తండ్రీకొడుకులు కలిసి ఆడుతున్నారు. తండ్రి రిటైర్మెంట్ ప్రకటించిన కొన్నేళ్ల తర్వాత కొడుకు అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తెలిసిందే. కానీ తండ్రీకొడుకులు కలిసి ఆడడం, అదీ ఫేమస్ టోర్నమెంట్ లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం మాత్రం అరుదనే చెప్పొచ్చు. అఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ టీ20 క్రికెట్ టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

అఫ్ఘనిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్ గా రాణిస్తున్న మొహమ్మద్ నబీ (40) ఈ టోర్నీలో మిస్ ఐనక్ రీజియన్ జట్టు తరఫున ఆడుతుండగా.. ఆయన కొడుకు హసన్ ఐసాఖిల్ (18) అమో రీజియన్‌ జట్టులో ఆడుతున్నాడు. తాజాగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. నబీ బౌలింగ్ చేశాడు. అటువైపు ఆయన కొడుకు ఐసాఖిల్ బ్యాటింగ్ చేశాడు. అయితే, తండ్రి వేసిన తొలి బంతినే ఐసాఖిల్ సిక్సర్ గా మలిచాడు.

సాధారణంగా కొడుకు సిక్స్ కొడితే ఏ తండ్రికైనా సంతోషమే. స్టాండ్స్ లో ఉండి చూస్తుంటే నబీ కూడా సంతోషంతో చప్పట్లు చరిచేవాడేమో కానీ తాను వేసిన బంతిని కొడుకు సిక్సర్ కొట్టడంతో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు. ఆ ఓవర్ లో నబీ మొత్తం 12 పరుగులు ఇవ్వగా.. ఈ మ్యాచ్ లో ఐసాఖిల్ హాఫ్ సెంచరీ (36 బంతుల్లో 52 పరుగులు) చేశాడు.
Mohammad Nabi
Afghanistan cricket
Spaghza Cricket League
Hasan Eisakhil
T20 match
father and son cricket
Afghanistan Premier League
cricket records
Mis Ainak Region
Amo Region

More Telugu News