Sheikh Mohammed bin Rashid Al Maktoum: ట్రామ్ లో సామాన్యుడిలా ప్రయాణించిన దుబాయ్ పాలకుడు.. వీడియో ఇదిగో!

Sheikh Mohammed bin Rashid Al Maktoum Travels on Dubai Tram



దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ మరోసారి అక్కడి ప్రజలను సర్ ప్రైజ్ చేశారు. సామాన్యుడిలా జనంలో కలిసిపోయి ట్రామ్ లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ (ఆర్ టీఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టా, టిక్ టాక్ లలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ వెంట కొంతమంది భద్రతా సిబ్బంది సివిల్ డ్రెస్సుల్లో కనిపించారు.

అయితే, ఈ ప్రయాణంలో రాజు కానీ, ఆయన భద్రతా సిబ్బంది కానీ ఎలాంటి హడావుడి చేయకపోవడం విశేషం. మిగతా ప్రయాణికులలానే వారంతా ట్రామ్ కోసం స్టేషన్ లో వేచి ఉండడం, ట్రామ్ రాగానే మిగతా వారితో పాటు లోపలికి వెళ్లి ఓ ఖాళీ సీటులో కూర్చోవడం వీడియోలో కనిపించింది. దేశాన్ని పాలించే రాజు తమతో కలిసి ట్రామ్ లో ఎక్కడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు.
Sheikh Mohammed bin Rashid Al Maktoum
Dubai
Dubai Ruler
Dubai Tram
Tram Travel
RTA Dubai
Viral Video
UAE
Dubai Roads and Transport Authority

More Telugu News