ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు

  • మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఘ‌ట‌న‌
  • గ్రామంలో నిన్న‌ రాత్రి నైట్‌హాల్టుగా ఉన్న ఆర్టీసీ బస్సు
  • బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడ‌తో పాక్షికంగా దగ్ధమైన వైనం
  • ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. గ్రామంలో మంగళవారం రాత్రి నైట్‌హాల్టుగా ఉన్న ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు సమాచారం. దాంతో బస్సు పాక్షికంగా దగ్ధమైందని అధికారులు తెలిపారు. 

సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్‌కు ఎందుకు నిప్పు పెట్టారో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


More Telugu News