Justice BR Gavai: భరణం కింద బీఎండబ్ల్యూ కారు కావాలన్న మహిళ... సొంతంగా సంపాదించుకోవాలమ్మా! అంటూ సీజేఐ హితవు
- ఓ విడాకుల కేసులో సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
- 18 నెలల వివాహ జీవితానికి భారీ మొత్తంలో భరణం అడగడం సరికాదని హితవు
- సొంతంగా సంపాదించుకుని జీవించాలని సూచన
విడాకుల కేసులో భరణం కింద ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్, రూ.12 కోట్ల నగదు, బీఎండబ్ల్యూ కారు కోరిన ఓ మహిళకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. అన్ని సామర్థ్యాలు ఉండి ఇలా అడగడమేంటి... సొంతంగా సంపాదించుకోవాలమ్మా అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హితవు పలికారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు, కేవలం 18 నెలల వివాహ జీవితం కోసం ఇంత భారీ మొత్తం భరణం కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఐటీ నిపుణురాలై, ఎంబీఏ పట్టా సాధించిన ఆ మహిళ, తన భర్త ధనవంతుడని, అతను తనను అన్యాయంగా విడిచిపెట్టాడని వాదించింది. అయితే, జస్టిస్ గవాయ్, "మీరు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో సులభంగా ఉద్యోగం సంపాదించవచ్చు. ఇంత చదువుకున్న మీరు ఇలా భరణం కోసం అడగడం సరికాదు. సొంతంగా సంపాదించుకుని జీవించాలి" అని అన్నారు. "18 నెలల వివాహానికి నెలకు రూ.1 కోటి భరణం, బీఎండబ్ల్యూ కారు కోరడం సమంజసం కాదు" అని ఆయన పేర్కొన్నారు.
భర్త తరఫు న్యాయవాది సీనియర్ అడ్వొకేట్ మాధవీ దివాన్, "మహిళ కూడా తన జీవనోపాధికి తానే బాధ్యత వహించాలి. అన్నీ డిమాండ్ చేయడం సరికాదు" అని వాదించారు. భర్త గతంలో సిటీబ్యాంక్ మేనేజర్‌గా పనిచేసినప్పటికీ, ప్రస్తుతం అతని ఆదాయం తగ్గినట్లు ఆయన న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.