ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం... కీలక నిర్ణయాలు ఇవిగో!
- నేడు తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు సమావేశం
- మీడియాకు వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్, ఈవో
- భక్తుల రద్దీ దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం
- ఒంటిమిట్ట రామాలయంలో అన్న ప్రసాదాల కోసం రూ.4.35 కోట్లు
- 142 మంది కాంట్రాక్టు డ్రైవర్ల క్రమబద్ధీకరణ
ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
- తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం
- తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం
- ఈ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటు
- అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా తిరుమల కొండపైకి వచ్చే వారి కోసం మెరుగైన వసతులు
- టీటీడీలో 142 మంది కాంట్రాక్టు డ్రైవర్ల క్రమబద్ధీకరణ. ఫైలు ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని నిర్ణయం
- ఒంటిమిట్ట రామాలయంలో అన్నప్రసాదాల కోసం రూ.4.35 కోట్లు కేటాయింపు
- కొత్తగా 700 వేదపారాయణదారులు ఉద్యోగాల కల్పన
- ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజన మందిరాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధుల విడుదల
- 320 ఆలయాలకు ఉచితంగా మైక్ సెట్ల అందజేత
- దేవాదాయ శాఖ సిఫారసుతో 600 మందికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి
- తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు తగిన నిర్మాణాల కోసం కన్సల్టెన్సీ నియామకం
- శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి కన్సల్టెన్సీ నియామకం