MS Dhoni: నా కూతురు కూడా అంతే!: భారతీయుల ఫిట్‌నెస్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni Comments on Indian Fitness Levels
  • ఫిట్‌గా ఉండాలంటే శారీరక శ్రమ అవసరమన్న ధోనీ
  • అందుకోసం ప్రణళిక తయారు చేసుకోవాలని సూచన
  • భారతీయుల సగటు ఫిట్‌నెస్ లెవల్ తగ్గిపోయిందని వ్యాఖ్య
శారీరక శ్రమ ఉంటేనే మనం ఫిట్‌గా ఉండగలమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. అందుకోసం వివిధ రకాల పనులు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోనీ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.

రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ భారతీయుల ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజుల్లో ప్రజలు తమ వయసు కంటే తక్కువ వయసు ఉన్నట్లుగా భావిస్తున్నారని, దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోతోందని అన్నాడు. భారతీయుల సగటు ఫిట్‌నెస్ స్థాయి తగ్గిపోయిందని పేర్కొన్నాడు.

తన కుమార్తె కూడా పెద్దగా శారీరక శ్రమ చేయదని అన్నాడు. ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి లేదని వెల్లడించాడు. తన కుమార్తెలాగే చాలామంది క్రీడలకు దూరంగా ఉంటున్నారని, ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలంటే శారీరక శ్రమ ఎంతో అవసరమని స్పష్టం చేశాడు.
MS Dhoni
Mahendra Singh Dhoni
Dhoni fitness
Indian fitness
Fitness levels
Physical activity
Sports
Dhoni daughter
Ranchi

More Telugu News