బాలికను కత్తితో బెదిరించిన ప్రేమోన్మాది... చాకచక్యంగా పట్టుకున్న స్థానికులు... వీడియో వైరల్!

  • మహారాష్ట్రలోని సతారాలో ఘటన
  • 10వ తరగతి బాలికకు ప్రేమోన్మాది వేధింపులు
  • స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను కత్తితో బెదిరించిన యువకుడు
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
మహారాష్ట్రలోని సతారాలో ఒక అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను 18 ఏళ్ల యువకుడు కత్తితో బెదిరించాడు. కొంతకాలంగా ఈ యువకుడు బాలికను ప్రేమించాలని వెంటపడుతూ, ఆమెను నిరంతరం వేధిస్తున్నాడు. బాలిక అతడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఆమె పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అతడు అడ్డుకొని, మెడపై కత్తి పెట్టి బెదిరించాడు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి, బాలికను ఆ యువకుడి నుండి సురక్షితంగా తప్పించారు. అనంతరం, ఆ యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల త్వరిత స్పందనతో బాలిక ప్రమాదం నుండి తప్పించుకుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News