Aamir Khan: హనీమూన్ హత్య కేసుతో క్రైమ్ థ్రిల్లర్‌కు ఆమిర్ ఖాన్ ప్లాన్‌!

Aamir Khan Plans Crime Thriller Based on Honeymoon Murder Case
  • ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు
  • క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను మించిన ట్విస్టుల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కేసు
  • ఆమిర్‌ను విపరీతంగా ఆకర్షించిన కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ, భావోద్వేగాలు
  • దాంతో ఈ హత్య కేసుతో క్రైమ్ థ్రిల్లర్‌కు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ప్లాన్‌
మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను మించిన ట్విస్టుల‌తో ఈ కేసు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే, తాజాగా ఈ కేసు ఆధారంగా ఓ చిత్రం రాబోతోంద‌ని స‌మాచారం. విభిన్న క‌థ‌ల‌తో స‌రికొత్త చిత్రాల‌ను అందించే బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఈ హ‌త్య కేసుతో క్రైమ్ థ్రిల్లర్‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ, భావోద్వేగాలు ఆమిర్‌ను విపరీతంగా ఆకర్షించాయని సమాచారం. కథ ప్రకారం, రాజా రఘువంశీ అనే వ్యక్తి హనీమూన్‌కు వెళ్ల‌గా అక్క‌డ‌ అనుమానాస్పద స్థితిలో చ‌నిపోతాడు. మర్డర్ వెనుక అతడి భార్య సోనమ్ పాత్రపై అనేక అనుమానాలు కలుగుతాయి. ఈ మిస్టరీని స్క్రీన్‌పై ఆసక్తికరంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఆమిర్ ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఆయన బృందం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఆమిర్ ఖాన్ ‘తలాష్’ అనే సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో వాస్తవ జీవిత ఘటన ఆధారంగా సినిమాని ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎమోషన్‌తో పాటు థ్రిల్ కూడా కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి ట్రీట్ అయ్యే అవకాశం ఉంది. 
Aamir Khan
Meghalaya honeymoon murder case
Honeymoon murder case
Crime thriller
Bollywood
Talaash movie
Raja Raghuwanshi
Sonam
Murder mystery

More Telugu News