Maria Farmer: ట్రంప్ తో చేదు అనుభవం ఎదురైందన్న నటి

Maria Farmer accuses Trump of inappropriate behavior in Epstein office
  • అమెరికా అధ్యక్షుడిపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు
  • జెఫ్రీ ఎప్ స్టీన్ ఆఫీసులో రాత్రిపూట ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపణ
  • ఎప్ స్టీన్ తో కలిసి పనిచేసేందుకు తాను సిద్దపడ్డ సమయంలో ఘటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ వెల్లడించారు. జెఫ్రీ ఎప్ స్టీన్ ఆఫీసులో ఓ రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపించారు. ఎప్ స్టీన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఓ రోజు రాత్రిపూట ఆయన తనకు ఫోన్ చేశారని మారియా చెప్పారు. అర్జెంటుగా ఆఫీసుకు రమ్మనడంతో నైట్ డ్రెస్ తోనే తాను వెళ్లానని వివరించారు. అప్పటికే అక్కడ ఉన్న ట్రంప్ తన శరీరంవైపు అదోలా చూశారని, తాను షార్ట్స్ ధరించడంతో కాళ్లవైపే చూస్తూ ఉండిపోయాడని చెప్పారు. ఈ సంఘటన 1995లో జరిగిందని అప్పుడు తనకు 20 ఏళ్లు ఉంటాయని మారియా తెలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎప్ స్టీన్ తనను చూస్తూ.. ‘నో నో.. ఆమె నీకోసం కాదు’ అని ట్రంప్ కు చెప్పారన్నారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్ స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికా వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మారియా ఫార్మర్ 1996లోనే ఎప్‌స్టీన్‌, మ్యాక్స్‌వెల్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మారియా ఈసారి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు చేశారు. మారియా ఆరోపణలపై వైట్ హౌస్ స్పందిస్తూ.. ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని ట్రంప్‌ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. ట్రంప్ ఏనాడూ ఎప్‌స్టీన్‌ ఆఫీస్‌కు వెళ్లలేదని వైట్ హౌస్ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ వెల్లడించారు.

Maria Farmer
Donald Trump
Jeffrey Epstein
Sex trafficking
White House
Epstein files
Steven Cheung
Maria Farmer allegations
Trump allegations

More Telugu News