Ponguru Narayana: అమరావతి రెండో దశ భూసమీకరణపై మంత్రి నారాయణ ఏమన్నారంటే..?

Ponguru Narayana on Amaravati Phase 2 Land Pooling
  • మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి నారాయణ
  • వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తామన్న మంత్రి
  • సీఎం చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామన్న మంత్రి నారాయణ
అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘమే దీనిపైనా చర్చిస్తుందని, ఆ నిర్ణయాన్ని వచ్చే క్యాబినెట్ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

మంత్రి నారాయణ నిన్న రాజధాని ప్రాంతంలో పర్యటించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల భవన సముదాయాలు, మంత్రులు, జడ్జీలు, ముఖ్య కార్యదర్శుల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు, సచివాలయ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ సిటీ, వాణిజ్య ప్రాంతాలు నిర్మించడానికి సుమారు పదివేల ఎకరాలు సీఆర్డీఏకి అవసరమని చెప్పారు. భూసేకరణ చేస్తే తమకు నష్టం వచ్చే అవకాశం ఉందని, భూసమీకరణ చేయాలని ఆయా గ్రామాల్లోని రైతులు కోరారని తెలిపారు. ఈ విషయాన్ని సబ్ కమిటీలో చర్చించారా అని గత క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారని తెలిపారు. 
Ponguru Narayana
Amaravati
Andhra Pradesh
Land Pooling
CRDA
Capital Region Development Authority
Chandrababu Naidu
AP Cabinet
Real Estate
Infrastructure Development

More Telugu News