బిల్డింగ్ లిఫ్ట్‌లో డెలివరీ బాయ్ మూత్ర విసర్జన.. కేసు నమోదు

  • ముంబైలోని విరార్ వెస్ట్‌లో ఘ‌ట‌న‌
  • సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీల‌న త‌ర్వాత ఘ‌ట‌న‌ను గుర్తించిన‌ నివాసితులు
  • బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు
ముంబైలో ఓ డెలివ‌రీ బాయ్ గ‌లీజ్ ప‌ని చేశాడు. న‌గ‌రంలోని స్థానిక‌ విరార్ వెస్ట్‌లోని ఒక భవనం లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేశాడు. దీంతో స‌ద‌రు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌పై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత భవనం నివాసితులు ఈ సంఘటనను గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ఆధారంగా... డెలివరీ ఏజెంట్ త‌న ఎడమ చేతిలో పార్శిల్ పట్టుకుని లిఫ్ట్ లోపల కనిపించాడు. లిఫ్ట్‌లో కొద్దిసేపు అటుఇటు తిరిగిన అత‌డు.. ఒక మూలలో మూత్ర విసర్జన చేశాడు. ముంబైలోని విరార్ వెస్ట్‌లోని సీడీ గురుదేవ్ భవనంలో ఈ సంఘటన జరిగింది.

భవనంలోని నివాసితులు లిఫ్ట్‌లో మూత్రం ఉండ‌టాన్ని గమనించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లింకిట్ జాకెట్ ధరించిన వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో నివాసితులు బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లి నిందితుడిని గుర్తించారు. అక్కడ అతనికి దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. దాంతో విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌లో అత‌నిపై కేసు న‌మోదైంది.




More Telugu News