Vidadala Rajini: మేము జన సమీకరణ చేయలేదు: విడదల రజని

Vidadala Rajini denies mobilizing crowds for Jagans visit
  • నేడు పోలీసు విచారణకు హాజరైన విడదల రజని
  • జనం గుండెల్లో జగన్ ఉన్నారని వ్యాఖ్య
  • జగన్ కోసం ప్రజలు వారంతట వారే వస్తున్నారన్న రజని
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడదల రజని ఈరోజు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం రజని మాట్లాడుతూ... జగన్ పర్యటనకు జన సమీకరణ చేశామని కేసులు పెట్టారని తెలిపారు. తాము జన సమీకరణ చేయలేదని... జగన్ పర్యటకు వస్తున్నారని తెలిసి ప్రజలు వారంతట వారే తరలి వస్తున్నారని చెప్పారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారని... ప్రత్యేకంగా జన సేకరణ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. 

జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారని రజని అన్నారు. పోలీసుల ద్వారా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మోసపోయామని జగన్ కు ప్రజలు చెబుతున్నారని అన్నారు. 

ఏడాది కాలంగా వైసీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు. మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చుట్టూ ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Vidadala Rajini
Jagan Mohan Reddy
YSRCP
Palnadu district
Sattenapalli
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Public gathering
Police investigation

More Telugu News