గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ-అమ‌రావ‌తి డిక్లరేష‌న్‌ను విడుద‌ల చేసిన సీఎం చంద్ర‌బాబు

  • 2030 నాటికి అమ‌రావ‌తిని గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తూ డిక్ల‌రేష‌న్‌
  • రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి అనుకూల ప‌రిస్థితులు క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్న సీఎం
  • గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెల‌కొల్పడమే డిక్ల‌రేష‌న్ ఉద్దేశం
గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీ-అమ‌రావ‌తి డిక్లరేష‌న్‌ను సీఎం చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో చీఫ్ సెక్ర‌ట‌రీ విజ‌యానంద్‌, నెడ్ క్యాప్ ఎండీ క‌మలాక‌ర్ బాబు స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 2030 నాటికి అమ‌రావ‌తిని గ్రీన్ హైడ్రోజ‌న్ వ్యాలీగా మార్చేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తూ డిక్ల‌రేష‌న్‌ను రూపొందించారు. 

రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి అనుకూల ప‌రిస్థితులు క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు తెలిపారు. గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెల‌కొల్ప‌డమే ఈ డిక్ల‌రేష‌న్ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 

ఇక‌, ఇటీవ‌ల అమ‌రావ‌తిలో గ్రీన్ హైడ్రోజ‌న్‌పై రెండు రోజుల పాటు జ‌రిగిన స‌మ్మిట్‌లో గ్రీన్ హైడ్రోజ‌న్ కంపెనీల సీఈఓలు, ఎండీలు, సీఓఓలు, ఇండ‌స్ట్రీ నిపుణులు పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ్మిట్‌లో రెండు రోజుల పాటు చ‌ర్చించిన అంశాల ఆధారంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా డిక్ల‌రేష‌న్‌ను ప్ర‌క‌టించింది. 


More Telugu News