ED: ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ED Petition Dismissed by Supreme Court in Land Case
  • రాజకీయ పోరాటం చేయొద్దని హితవు
  • అది అధికార దుర్వినియోగమేనని ఆగ్రహం
  • కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
సూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూముల అక్రమ కేటాయింపుల కేసులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేశ్ లకు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిందని ఈడీ గుర్తుచేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తూ.. ఈ వ్యవహారంలో ఈడీ రాజకీయ పోరాటం చేస్తోందని సుప్రీం ధర్మాసనం విమర్శించింది. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టం చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు స్వీకరించడంపై సీజేఐ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది.
ED
Enforcement Directorate
Karnataka High Court
Siddaramaiah
Suresh
Illegal Land Allocation
Supreme Court
BM Parvathi
Money Laundering Case
Karnataka Politics

More Telugu News