Ram Charan: 'పెద్ది' కోసం రామ్ చరణ్ మాస్ లుక్‌.. 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Ram Charan gears up for changeover for Peddi next schedule
  • రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు సనా కాంబోలో 'పెద్ది' 
  • ఇందులో ర‌గ్గుడ్ లుక్స్‌లో క‌నిపించ‌నున్న చెర్రీ 
  • పెద్ది కోసం ఛేంజోవ‌ర్ ప్రారంభ‌మైందంటూ మాస్ లుక్ పిక్‌ను షేర్ చేసిన చ‌ర‌ణ్‌
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది'. ఇందులో చెర్రీ ర‌గ్గుడ్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. ఇందులో భాగంగా తాజాగా చ‌ర‌ణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఓ ఫొటో షేర్ చేశారు. " 'పెద్ది' కోసం ఛేంజోవ‌ర్ ప్రారంభ‌మైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం" అనే క్యాప్ష‌న్‌తో పంచుకున్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ పిక్‌లో లాంగ్ హెయిర్‌తో చ‌ర‌ణ్ బీస్ట్‌లా క‌నిపిస్తున్నారు. దాంతో ఆ ఫొటో చూసిన మెగా అభిమానులు 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా, 'పెద్ది' సినిమా భారీ స్థాయిలో నిర్మాణం జ‌రుపుకుంటోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌ వెంకట సతీశ్ కిలారు.. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇక‌, ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫీ నబకాంత్ మాస్టర్ అందిస్తున్నారు.

రామ్ చరణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా జాన్వీ కపూర్ న‌టిస్తుండ‌గా.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇత‌ర‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుదల కానుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
Ram Charan
Peddi
Buchi Babu Sana
Janhvi Kapoor
Telugu Movie
Sports Drama
Action Movie
Vriddhi Cinemas
Sukumar Writings
AR Rahman

More Telugu News