Ramdas Athawale: క్రికెట్లోకి రాజకీయాలను లాగొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై కేంద్రమంత్రి అథవాలే స్పందన

Ramdas Athawale reacts to India Pak match cancellation
  • భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్
  • రద్దు చేసిన నిర్వాహకులు
  • రాజకీయ ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమన్న అథవాలే
భారత్-పాకిస్థాన్ మధ్య  వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయడంపై కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల్లో జరిగే క్రీడా పోటీలను రాజకీయ కారణాలతో రద్దు చేయడం సరికాదని ఆయన అన్నారు. క్రీడలు సౌహార్దాన్ని, ఐక్యతను పెంపొందించే అవకాశంగా ఉండాలని, వాటిని రాజకీయ వివాదాలతో ముడిపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంపై అథవాలే మాట్లాడుతూ, "క్రీడలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు రాజకీయ ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరం" అని పేర్కొన్నారు. మ్యాచ్ భారత్ లో జరిగేట్టయితే ఆలోచించవచ్చు.. కానీ ఈ మ్యాచ్ జరుగుతోంది ఇంగ్లండ్ లో... ఇటువంటి మ్యాచ్‌లు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశంగా ఉపయోగపడాలని ఆయన సూచించారు. 

ఈ వివాదంపై ఇతర క్రీడా సంఘాలు, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. క్రీడా రంగంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, ఆటగాళ్లకు స్వేచ్ఛగా పోటీపడే అవకాశం కల్పించాలని అథవాలే పిలుపునిచ్చారు.
Ramdas Athawale
India Pakistan match
World Championship of Legends
Cricket match cancelled
Sports and politics
India Pakistan relations
Cricket diplomacy
Athawale statement

More Telugu News