Revanth Reddy: వరంగల్ లో క్రికెట్ స్టేడియం... సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యేలు

Warangal MLAs Request CM Revanth Reddy for Cricket Stadium
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు
  • యంగ్ స్పోర్ట్స్ స్కూల్ ప్రస్తావన తెచ్చిన శాసనసభ్యులు
  • సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లాలో ఆధునిక క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం జరిగిన సమావేశంలో యంగ్ స్పోర్ట్స్ స్కూల్ స్థాపనతో పాటు స్టేడియం అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు సీఎంకు వినతిపత్రం సమర్పించారు.

అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, విదేశీ పెట్టుబడులను ఆకర్షించినందుకు ఎమ్మెల్యేలు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy
Warangal
Cricket Stadium
Telangana
MLA
Sports School
Infrastructure Development
Foreign Investments

More Telugu News