Mudragada Padmanabham: అవసరమైతే ముద్రగడను జగన్ ఎయిర్ లిఫ్ట్ చేయమన్నారు: చిర్ల జగ్గిరెడ్డి

Mudragada Padmanabham to be airlifted if needed says Jagan
  • అస్వస్థతకు గురైన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం
  • కాకినాడ మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స
  • పరామర్శించిన కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
  • ముద్రగడ తనయుడితో జగన్ ఫోన్ లో మాట్లాడారని వెల్లడి
వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాకినాడ మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కాకినాడ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను పరామర్శించారు. ఆసుపత్రిలో ఉంటూ  తండ్రి బాగోగులు చూసుకుంటున్న ముద్రగడ కుమారుడు గిరితో మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పారు. 

అనంతరం చిర్ల జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. జగన్... ముద్రగడ కుమారుడు గిరితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారని వివరించారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా సరే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించారని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. 
Mudragada Padmanabham
Jagan Mohan Reddy
Chirla Jaggireddy
YSRCP
Kapu Leader
Kakinada
Health Update
Andhra Pradesh Politics
Giri Mudragada
Air Lift

More Telugu News