Ambati Rambabu: అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
- అంబటికి నోటీసులు ఇచ్చిన సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు
- జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు
- రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.
ఇక, గతంలో కూడా సత్తెనపల్లి పట్టణ పీఎస్‌లో అంబటిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు ఫైల్ అయింది. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజనీతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా జిల్లా నేతలు ఉన్నారు. ఇలా మొత్తం 118 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటికే పలువురిని విచారించారు.