Anshul Kamboj: నాలుగో టెస్టుకు ముందు భారత జట్టులో చేరిన అన్షుల్ కాంబోజ్

Anshul Kamboj Replaces Injured Arshdeep in India Squad
  • ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన అర్షదీప్
  • అతడి స్థానంలో జట్టులో చేరిన అన్షుల్ కాంబోజ్
  • 23న ప్రారంభం కానున్న నాలుగో టెస్టు
  • ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా తదుపరి జరగనున్న రెండు టెస్టుల కోసం హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ జట్టులో చేరాడు. తీవ్రంగా గాయపడిన లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ స్థానంలో ఈ 24 ఏళ్ల పేసర్ ఆడనున్నాడు. అన్షుల్ ఇప్పటికే మాంచెస్టర్ బయలుదేరాడని, మిగతా రెండు మ్యాచుల్లో అతడు ఆడతాడని బీసీసీఐ తెలిపింది.

గురువారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నించిన అర్షదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. అర్షదీప్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయనప్పటికీ, నాలుగో టెస్టులో ఎవరైనా పేసర్‌కు విశ్రాంతి కల్పిస్తే అతడి స్థానంలో అర్షదీప్‌ను బరిలోకి దింపాలని జట్టు నిర్ణయించింది. అయితే, ఇప్పుడతడు గాయపడటంతో ఆ స్థానాన్ని అన్షుల్‌తో భర్తీ చేయనున్నారు. 

కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో భారత్ ఒక దాంట్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ రెండు టెస్టులు గెలుచుకుని 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు కీలకంగా మారింది.
Anshul Kamboj
India vs England
India Cricket
Arshdeep Singh
Test Series
Indian Cricket Team
Haryana
Manchester Test
Old Trafford
Cricket News

More Telugu News