Dubai flight: స్నేహితురాలు దుబాయ్ లో దిగింది.. కానీ నేనింకా ఇంటికి చేరుకోలేదు... బెంగళూరు యువతి వైరల్ పోస్ట్

Bangalore traffic viral post friend in Dubai I am still stuck
--
సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు సిటీలో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవని, గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని రోడ్లపైనే ఉండిపోతున్నామని ప్రియాంక అనే యువతి వాపోతోంది. తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తన స్నేహితురాలు ఇంద్రయాని దుబాయ్ వెళుతుంటే తాను ఆమెను విమానాశ్రయంలో దింపేందుకు వెళ్లానని చెప్పింది. ఇంద్రయానిని దింపేసి తాను ఇంటికి బయలుదేరానని, ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోందని వివరించింది.

తాను విమానాశ్రయంలో దింపిన స్నేహితురాలు ఇంద్రయాని దుబాయ్ లో దిగింది కానీ తాను మాత్రం ఇంటికి చేరుకోలేదని వాపోయింది. బెంగళూరు నుంచి దుబాయ్ నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీకి దాదాపుగా 4 గంటలు పడుతుందని ప్రియాంక గుర్తుచేసింది. ఈ ఘటనతో బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చని చెప్పింది. ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇటీవల పలువురు బెంగళూరు వాసులు ట్రాఫిక్ కారణంగా తమ ఇంధన ఖర్చులు విపరీతంగా పెరిగాయని వాపోయారు. ఒకటిన్నర కిలోమీటర్ల దూరానికి 3 లీటర్ల పెట్రోల్ ఖర్చయిందని కొందరు, ట్రాఫిక్ లో ఆగడంతో కారులోని ఏసీ కారణంగా పెట్రోల్ ఖర్చయిపోతోందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Dubai flight
Bengaluru airport
Traffic problems
Silicon Valley India
Priyanka
Bangalore traffic
Indrayani
Viral post
Bengaluru news
Fuel costs

More Telugu News