AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో 8 మంది నిందితులు .. వారు ఎవరంటే ..?

AP Liquor Scam 8 More Accused Names Revealed
  • కోర్టులో ప్రిలిమినరీ చార్జ్ షీటు దాఖలు చేసిన సిట్
  • నిందితుల జాబితాలో ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ పాత్రదారులు 
  • చార్జ్ షీటులో వారి పాత్ర  వివరాలు వెల్లడించిన సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఈ విషయాన్ని ప్రాథమిక అభియోగ పత్రం (ప్రిలిమినరీ చార్జ్ షీట్)లో సిట్ పేర్కొంది. నిన్న శనివారం కోర్టులో సిట్ ప్రిలిమినరీ చార్జ్ షీటు దాఖలు చేసింది. తాజాగా నిందితులుగా చేర్చిన వారిలో ఎక్కువ మంది లిక్కర్ ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌లో పాత్రధారులు. ముడుపుల సొమ్ము భద్రపరిచిన డెన్లలోని సొత్తు హ్యాండ్లర్లు.

ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిల ప్రతినిధులుగా వీరు ఈ స్కామ్‌లో కీలకంగా పని చేశారు. వీరిలో కొంత మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. వీరిలో పలువురు దుబాయ్‌లో, ఒకరిద్దరు అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో వీరి పాత్ర, ప్రమేయం గురించి చార్జ్ షీటులో సిట్ ప్రస్తావించింది.

తాజా నిందితుల్లో రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి సోదరుడు ముప్పిడి అనిరుథ్ రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, సైమన్ ప్రసన్ బావమరిది మోహన్ కుమార్, ముప్పిడి అనిరుథ్ రెడ్డి బావమరిది అనిల్ కుమార్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు, ఐఐటీ పూర్వ విద్యార్ధి సుజల్ బెహరూన్ లు ఉన్నారు. వీరంతా లిక్కర్ ముడుపుల సొమ్ము వసూళ్లు, తరలింపు, డొల్ల కంపెనీల ద్వారా మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. 
AP Liquor Scam
Raj Kesi Reddy
Andhra Pradesh Liquor Scam
Liquor Scam
Eshwar Kiran Kumar Reddy
Muppidi Avinash Reddy
Bolleram Shivakumar
Dubai
Illegal Liquor

More Telugu News