Chandrababu Naidu: తిరుపతి కపిలేశ్వరాలయంలో పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తిన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu as Sanitation Worker at Tirupati Kapileswaram Temple
  • నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
  • కపిలేశ్వరాలయాన్ని సందర్శించిన సీఎం
  • ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన వైనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఇక్కడి కపిలేశ్వరాలయాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. చీపురుతో ఊడ్చి, అనంతరం శుభ్రంగా తుడిచారు. పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. 

ఈ పర్యటన సందర్భంగా, శ్రీ కపిలేశ్వరాయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయన అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. పవిత్ర వస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించారు. 

అంతకుముందు, తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అక్కడి అధికారులు ఆయనకు వేస్ట్ ప్రాసెసింగ్ విధానాన్ని వివరించారు. ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. 

Chandrababu Naidu
Tirupati
Kapileswaram Temple
Andhra Pradesh
Sanitation Workers
Waste Processing
Renigunta Airport
Tukivakam
Temple Cleaning
AP CM

More Telugu News