YS Sharmila: షర్మిల బానిసత్వంపై మాట్లాడుతుంటే ఊసరవెల్లికే సిగ్గేస్తోంది: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy Criticizes YS Sharmila Over Slavery Remarks
  • టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు బీజేపీకి బానిసలన్న షర్మిల
  • మోదీ జపం తప్ప మరేమీ పట్టించుకోరంటూ విమర్శలు
  • బానిసత్వానికి అడ్రస్ షర్మిల అంటూ విష్ణు ట్వీట్
టీడీపీ, వైసీపీ, జనసేనన ఎంపీలు బీజేపీకి బానిసలు అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బానిసత్వానికి అడ్రస్ అడిగితే "షర్మిల" అని చెబుతారని... అలాంటి షర్మిల ఇప్పుడు బానిసత్వంపై అన్ని పార్టీలకు మాస్టర్ క్లాస్ ఇస్తుంటే ఊసరవెల్లికే సిగ్గేస్తోందని విమర్శించారు.ఈ మేరకు ఆయన షర్మిల చేసిన ట్వీట్ ను కూడా పంచుకున్నారు. 

అంతకుముందు, షర్మిల తన ట్వీట్ లో మూడు పార్టీల ఎంపీలపై నిప్పులు చెరిగారు. టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు పేరుకే ఎంపీలు... వీళ్లంతా బీజేపీకి బానిసలే... వీరికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యం... రాష్ట్ర హక్కుల కన్నా మోదీ మెప్పు పొందడమే మిన్న... పదవులు అనుభవించడంపై ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదు... తమ నోరును హక్కుల కోసం కాకుండా, మోదీ జపం చేయడానికి మాత్రమే వాడతారు... అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
YS Sharmila
Vishnuvardhan Reddy
AP Congress
Andhra Pradesh BJP
TDP
YCP
Janasena
BJP Alliance
AP Politics
Political Criticism

More Telugu News