Satya Kumar: బాలకృష్ణ, మహేశ్ బాబులా చేయగలరా?: వైసీపీకి సత్యకుమార్ సవాల్

Satya Kumar Criticizes YSRCP for Rappa Rappa Dialogue in AP Politics
  • ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా రప్పా రప్పా డైలాగ్
  • సినిమా డైలాగ్ బయట చెబితే తప్పేంటని అంటున్నారని సత్యకుమార్ మండిపాటు
  • సినిమాల్లోవి బయట చెప్పడం తప్పేనని వ్యాఖ్య
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రప్పా రప్పా అనే సినిమా డైలాగ్ బాగా పాప్యులర్ అయింది. వైసీపీ శ్రేణులు మొదలుపెట్టిన ఈ డైలాగ్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భాష వాడటం తప్పని తెలుకోవడం పోయి కరెక్ట్ అని చెప్పడం సరికాదని అన్నారు. 

సినిమాల్లో డైలాగ్ బయట చెబితే తప్పేంటని అంటున్నారని... సినిమాల్లో చేసేవి బయట చెప్పాలనుకోవడం తప్పేనని అన్నారు. బాలకృష్ణ తొడకొడితే 20 సుమోలు గాల్లోకి ఎగురుతాయని, మహేశ్ బాబు 20 అంతస్తుల నుంచి రైల్లోకి దూకుతారని... ఇలాంటివి బయట చేసి చూపించగలరా? అని సవాల్ విసిరారు. విషపూరిత వాతావరణంలోకి సమాజాన్ని నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. 
Satya Kumar
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Rappa Rappa Dialogue
Balakrishna
Mahesh Babu
AP Minister
Political Speech

More Telugu News