Pakistan Parliament: టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించినా పాక్ లో ఇక మరణశిక్ష ఉండదు!

Pakistan Ends Death Penalty for Aiding Terrorists Replaces with Life Sentence
  • క్రిమినల్ లాస్ బిల్లు సవరణలకు పాక్ పార్లమెంటు ఆమోదం
  • టెర్రరిస్టులకు, హైజాకర్లకు ఆశ్రయం ఇస్తే గతంలో మరణశిక్ష
  • తాజా బిల్లుతో మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
పాకిస్థాన్ పార్లమెంటులో క్రిమినల్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2025 ఆమోదం పొందింది. ఈ బిల్లు... టెర్రరిస్టులకు, హైజాకర్లకు ఆశ్రయం ఇవ్వడం, మహిళలకు బహిరంగంగా బట్టలు ఊడదీయడం వంటి నేరాలకు మరణశిక్షను రద్దు చేసి, బదులుగా జీవిత ఖైదును విధించేలా చేస్తుంది. ఈ బిల్లును పాక్ హోం శాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి చట్టసభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు పాకిస్థాన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 354-ఎ, 402-సి లలో సవరణలు చేస్తుంది. సెక్షన్ 354-ఎ ప్రకారం, ఎవరైనా మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు ఊడదీసి, బహిరంగంగా అవమానిస్తే, మరణశిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానాతో శిక్షించబడతారు. కానీ, కొత్త బిల్లు ఈ నేరాలకు మరణశిక్షను తొలగించి, జీవిత ఖైదును తప్పనిసరి శిక్షగా విధిస్తుంది. ఈ బిల్లు యూరోపియన్ యూనియన్‌తో జీఎస్‌పీ ప్లస్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చేందుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, ఈ సవరణలకు పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్లమెంటరీ నాయకుడు సయ్యద్ అలీ జఫర్, బలూచిస్థాన్ అవామీ పార్టీ సెనెటర్ సమీనా ముంతాజ్ జెహ్రీ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మహిళలపై ఇటువంటి దాడులు హత్యకు సమానమైన నేరాలని, వీటికి మరణశిక్షను కొనసాగించాలని వారు వాదించారు. 1982లో జనరల్ జియా ఉల్ హక్ హయాంలో మహిళను బట్టలు ఊడదీయడం వంటి నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష నుంచి మరణశిక్షగా మార్చినట్లు సెనెటర్ జఫర్ గుర్తు చేశారు. 

అయితే, ఈ చట్టాన్ని కొందరు కుటుంబ, ఆస్తి వివాదాల్లో దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులకు లంచాలు ఇచ్చి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మంత్రి తలాల్ వెల్లడించారు. 


Pakistan Parliament
Criminal Laws Amendment Bill 2025
Talal Chaudhry
GSP Plus trade agreement
Syed Ali Zafar
Samina Mumtaz Zehri
terrorism
blasphemy law
European Union
death penalty

More Telugu News