Nimmala Ramanayudu: ఆ డబ్బుతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు: మంత్రి నిమ్మల

Minister Nimmala Comments on Pension Scheme and Polavaram Project
  • అనకాపల్లి జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
  • చోడవరం నియోజకవర్గంలో మంత్రి నిమ్మల పర్యటన
  • ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలును వివరించిన వైనం
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

ముఖ్యంగా, పెంచిన పెన్షన్లను ఇంటివద్దకే అందిస్తున్నామని అన్నారు. ఏపీలో ఐదేళ్లలో ఇచ్చే పెన్షన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని, ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా రాజీపడకుండా పెన్షన్ అందిస్తున్నామని మంత్రి నిమ్మల వివరించారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయని విమర్శించారు. 

"మూడు రాజధానులు అన్నారు... ఒక్క రాజధాని కూడా కట్టలేదు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తరిమేశారు. మద్యం, ఇసుక, మైనింగ్, భూములు... ఇలా అన్నీ కొల్లగొట్టారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ తప్పులన్నీ సరిదిద్దుతూ వస్తోంది" అని నిమ్మల పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో పాటు ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.
Nimmala Ramanayudu
AP Irrigation Minister
Andhra Pradesh
Pension Scheme
Polavaram Project
Chandrababu Naidu
TDP Government
Chodavaram
Anakapalli District
YSRCP Government

More Telugu News