Sreeleela: ప్రేమ, పెళ్లిపై శ్రీలీల స్పందన

Sreeleela responds on love and marriage
  • 30 ఏళ్లు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదన్న శ్రీలీల
  • ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే అని వెల్లడి
  • తనకు పెద్ద సినిమాలు వస్తున్నాయన్న శ్రీలీల
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన హీరోయిన్ శ్రీలీల. అద్భుతమైన నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి అంశాలపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తన వయసు 24 సంవత్సరాలు మాత్రమేనని... 30 ఏళ్లు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని శ్రీలీల తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పింది. ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు తనకు సమయం లేదని తెలిపింది. తాను నిజంగా రిలేషన్ లో ఉంటే... అమ్మ తమతో ఉండగలదా అని ప్రశ్నించింది. అమెరికా వెళ్లినప్పుడు కూడా అమ్మ తనతోనే ఉంటుందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎవరితో ప్రేమలో పడగలనని ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు పెద్ద సినిమాలు వస్తున్నాయని తెలిపింది. ప్రేక్షకుల అభిమానం పొందడమే తన లక్ష్యమని చెప్పింది.
Sreeleela
Sreeleela interview
Sreeleela marriage
Sreeleela movies
Tollywood actress
Bollywood entry
Telugu cinema
Love and marriage
Indian actress

More Telugu News