గరీబ్‌రథ్ రైలులో మంటలు.. లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

  • రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో ఘటన
  • ఇంజిన్ పొగ రావడాన్ని గుర్తించి లోకో పైలట్‌ను అప్రమత్తం చేసిన ప్రయాణికులు
  • లోకో పైలట్ సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ముప్పు
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లా, సెంద్రా రైల్వే స్టేషన్‌లో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. లోకోపైలట్ సత్వరం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా రైలు నుంచి ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు లోకోపైలట్‌న్ అప్రమత్తం చేశారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. గరీభ్‌రథ్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదంటే సాంకేతిక సమస్య కారణంగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 

ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.   


More Telugu News