ISRO: శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఇస్రో సేవ‌లు

TTD to Use ISRO Services for Srivari Brahmotsavam
  • బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌లో ఇస్రో సేవ‌ల‌ను వినియోగించుకునే యోచ‌న‌లో టీటీడీ
  • కొన్నేళ్లుగా ముఖ్య వాహ‌న సేవ‌ల్లో పాల్గొంటున్న భ‌క్తుల సంఖ్య‌ను సుమారుగా లెక్కిస్తోన్న టీటీడీ 
  • సెప్టెంబ‌ర్ 24న ప్రారంభం కానున్న బ్ర‌హ్మోత్స‌వాలు
శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల విష‌యంలో టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌లో ఇస్రో సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు టీటీడీ రెడీ అవుతోంది. కొన్నేళ్లుగా ముఖ్య వాహ‌న సేవ‌ల్లో పాల్గొంటున్న భ‌క్తుల సంఖ్య‌ను టీటీడీ సుమారుగా లెక్కిస్తోంది. 

అయితే, సెప్టెంబ‌ర్ 24న ప్రారంభం కానున్న బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా నిర్వ‌హించే గ‌రుడోత్స‌వం రోజున మాడ‌వీధులు, బ‌య‌ట ఎంత‌మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంద‌న్న‌ది అత్యాధునిక శాటిలైట్ల ద్వారా గుర్తించి, స‌మాచారాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌ద్వారా త‌గిన ఏర్పాట్లు చేసే వీలు క‌లుగుతుంద‌ని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.  
ISRO
TTD
Tirumala Tirupati Devasthanams
Srivari Brahmotsavam
Brahmotsavam festival
Garudotsavam
Satellite technology
Pilgrim crowd management
Tirumala
Andhra Pradesh

More Telugu News