Velu Prabhakaran: ప్రముఖ తమిళ దర్శక నటుడు కన్నుమూత

Tamil director Velu Prabhakaran passes away at 68
  • అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వేలు ప్రభాకరన్
  • ఆయన వయసు 68 సంవత్సరాలు
  • 2017లో రెండో పెళ్లి చేసుకున్న ప్రభాకరన్
కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

1980లో వచ్చిన 'ఇవర్గళ్ విత్యసామానవర్గళ్' చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. 'నాలయ మనిదన్' సినిమాతో దర్శకుడిగా మారారు. తన సినిమాల ద్వారా సున్నితమైన అంశాలను ఆయన టచ్ చేసేవారు. నటుడిగా కూడా ఆయన మెప్పించారు. పలు చిత్రాల్లో నటించారు. చివరగా గత ఏడాది విడుదలైన 'గజన' మూవీలో ఆయన కనిపించారు. 

'కదల్ కాదై' సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్ ను ఆయన 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శకనటి జయాదేవి ఆయన మొదటి భార్య.
Velu Prabhakaran
Tamil director
Kollywood
Tamil cinema
Shirley Das
Gajina movie
Ivargal Vidyasamanavargal
Nalaya Manithan
Tamil film industry

More Telugu News