Jaggareddy: చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించుకుంటే తప్పేముంది?: జగ్గారెడ్డి

Jaggareddy criticizes BRS leaders on Revanth Chandrababu meeting
  • చంద్రబాబు, రేవంత్ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులన్న జగ్గారెడ్డి
  • ఇద్దరూ ఢిల్లీలో ఏం మాట్లాడారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్న
  • మమ్మల్ని కూడా ఫామ్ హౌస్ లో పడుకోమంటారా అని ఎద్దేవా
చంద్రబాబు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని.... ఇద్దరూ కూర్చొని ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుంటే తప్పేముందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఫామ్ హౌస్ పాలన అని.... రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసమే రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళుతున్నారని అన్నారు. 

చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో ఏం మాట్లాడుకున్నారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా? కళ్లు దొబ్బాయా? అని ప్రశ్నించారు. బావబామ్మర్దులది పనికిమాలిన ఏడుపు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల పట్ల బీఆర్ఎస్ నేతలకు బాధ్యత లేదని విమర్శించారు. మీరు ఫాంహౌస్ లోనే ఉంటున్నారని... మమ్మల్ని కూడా ఫాంహౌస్ లోనే పడుకోమంటారా? అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లు రాజభోగం అనుభవించి పదవి పోయేసరికి షాక్ లో ఉన్నారని అన్నారు. కేటీఆర్ కు పదవి లేదనే బాధ ఓవైపు, చెల్లెలి స్ట్రోక్ మరోవైపు ఉందని చెప్పారు.
Jaggareddy
Revanth Reddy
Chandrababu Naidu
Telangana Congress
BRS Party
Telangana Politics
AP Politics
KCR Farmhouse
Telangana Rights
KTR

More Telugu News