Anand Mahindra: ఒక్క నిర్ణయం చాలు... తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Tweets in Telugu About Mahindra Furiio 8 Truck
  • సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా
  • తాజాగా మహీంద్రా నుంచి మార్కెట్లోకి ఫ్యూరియో-8 ట్రక్కులు
  • తెలుగు యాడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆనంద్
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా ఆయన తెలుగులో ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మహీంద్రా సంస్థ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లో వచ్చాయి. దీనికి సంబంధించిన తెలుగు యాడ్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక్క నిర్ణయం చాలు... మీ విధి మీ చేతుల్లో ఉంది... ట్రక్ మార్చండి... మీ విధిని వశం చేసుకోండి అంటూ పేర్కొన్నారు. 

మహీంద్ర ఫ్యూరియో 8 ట్రక్కు యొక్క కీలక ఫీచర్లు: (మహీంద్రా వెబ్ సైట్ లో పేర్కొన్న మేరకు)

ఎక్కువ మైలేజ్: ఇది మరిన్ని కిలోమీటర్లు పరుగెడుతుంది, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ లాభాన్ని అందిస్తుంది.
ఎక్కువ పేలోడ్: ఇది మరిన్ని బరువులను మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
తక్కువ నిర్వహణ ఖర్చు: ఇది తక్కువ నిర్వహణ ఖర్చులతో రాబడిని పెంచుతుంది.
వేగవంతమైన హామీ: ఇమాక్స్ టెలిమాటిక్స్ పరిష్కారంతో వేగవంతమైన సేవను అందిస్తుంది.

Anand Mahindra
Mahindra
Mahindra Group
Furiio 8 truck
trucks
Telugu tweet
business
automobiles
India
mileage

More Telugu News