Road Accident: ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

Fatal Accident on ORR Near Adibatla Three Killed
  • రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు 
  • ముగ్గురు అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిభట్ల వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల‌ను కావలి బాల‌రాజు, గుగులోత్ జ‌నార్ధ‌న్‌, మాలోత్ చందులాల్‌గా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కారులోనుంచి అతికష్టంమీద బయటకు తీసి ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ  ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident
ORR Accident
Telangana Accident
Adibatla Accident
Fatal Car Crash
Ranga Reddy District
Traffic Collision
Telangana Road Safety

More Telugu News