ప్రియాంక గాంధీ భర్తపై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

  • షికోపూర్ భూముల వ్యవహారంలో ఛార్జిషీట్ దాఖలు
  • ఈ కేసులో పలుమార్లు విచారణకు పిలిచిన ఈడీ
  • మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఛార్జిషీట్
షికోపూర్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది.

ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈడీ విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి 2018లో రాబర్ట్ వాద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాద్రాతో పాటు నాటి హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్, ఓ ప్రాపర్టీ డీలర్ పేరును ఇందులో ప్రస్తావించారు. ఇందులో అవినీతి, ఫోర్జరీ చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి.


More Telugu News