Deepti Sharma: అమ్మాయిల క్రికెట్లోనూ సింగిల్ హ్యాండ్ సిక్స్... వీడియో చూడండి!

Deepti Sharma Hits Single Hand Six in Womens Cricket
  • పురుషుల క్రికెట్లో బాగా ఫేమస్ అయిన సింగిల్ హ్యాండ్ సిక్సులు
  • ముఖ్యంగా పంత్ రాకతో ఈ తరహా సిక్సులు కామన్ గా మారిన వైనం
  • తాజాగా ఇంగ్లండ్ పై ఒంటి చేత్తో సిక్స్ కొట్టిన టీమిండియా అమ్మాయి దీప్తి శర్మ
పురుషుల క్రికెట్లో సింగిల్ హ్యాండ్ తో సిక్సులు కొట్టడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఇలాంటి షాట్లకు పెట్టింది పేరు. అయితే అమ్మాయిల క్రికెట్లోనూ ట్రెండ్ మారింది. టీమిండియా బ్యాట్స్ ఉమన్ దీప్తి శర్మ ఇంగ్లండ్ తో వన్డే మ్యాచ్ లో ఒంటి చేత్తో సిక్స్ కొట్టి ఔరా అనిపించింది. ఇంగ్లండ్ బౌలర్ బెల్ విసిరిన బంతిని మిడ్ వికెట్ మీదుగా సింగిల్ హ్యాండ్ తో కొట్టిన సిక్స్ అందరినీ అలరించింది. కామెంటేటర్లు సైతం "ఎక్స్ ట్రార్డనరీ షాట్" అంటూ కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

కాగా, మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ మాట్లాడుతూ... నెట్స్ లో  ఇలాంటి షాట్లను బాగా ప్రాక్టీస్ చేశానని, రిషబ్ పంత్ ఆట చూసిన తర్వాతే ఇలాంటి షాట్లు కొట్టాలన్న ఆలోచన వచ్చిందని వెల్లడించింది. 
Deepti Sharma
Deepti Sharma six
Indian women's cricket
India vs England
Single hand six
Rishabh Pant
Cricket
Womens cricket

More Telugu News