Ranya Rao: గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు.. న‌టి ర‌న్యారావుకు ఏడాది జైలు

Actress Ranya Rao gets 1 year jail Term
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్ర‌మ ర‌వాణా కేసు
  • ఈ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్
  • ఆమెకు ఒక ఏడాది జైలు శిక్ష‌ విధించిన న్యాయ‌స్థానం
  • ఇటీవలే నటి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను కొట్టేసిన కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు ఒక ఏడాది జైలు శిక్ష‌ విధించింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను కొట్టేసిన బెంగళూరు కోర్టు తాజాగా ఆమెకు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

అంతేగాక‌ ఈ ఏడాది కాలంలో రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని కూడా బెంగళూరు కోర్టు ర‌ద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నటి రన్యారావు ఏడాది పాటు జైలులోనే ఉండనున్నారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. 

కాగా, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి 14.3 కిలోల బంగారం (రూ. 12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. 

నటి రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్‌‌లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బెంగ‌ళూరు కోర్టు వెల్ల‌డించిన తీర్పు ప్ర‌కారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి విచార‌ణ‌లు జ‌రుగుతాయ‌ని కోర్టు పేర్కొంది. ఇలా ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. 
Ranya Rao
Kannada actress
Gold smuggling case
Bangalore court
DRI
Kempegowda International Airport
Tarun Konduru Raju
Sahil Jain
Smuggling racket

More Telugu News