Viral Vayyari Song: 'వైర‌ల్ వ‌య్యారి' పాట‌కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Grandmas Amazing Dance Moves for Sreeleelas Viral Vayyari Song
  • డీఎస్‌పీ సంగీతం అందించిన తాజా చిత్రం ‘జూనియర్‌’
  • ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానున్న సినిమా
  • నిన్న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌
  • ఈ ఈవెంట్‌లో ‘వైరల్ వయ్యారి’ పాట‌పై బామ్మ మ‌ణి కిర్రాక్ డ్యాన్స్
రాక్‌స్టార్‌ దేవి శ్రీప్ర‌సాద్‌ సంగీతం అందించిన తాజా చిత్రం ‘జూనియర్‌’. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రమే ఈ ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు.

ఇక ఈ సినిమాలోని “వైరల్ వయ్యారి నేనే… వయసొచ్చిన అణుబాంబును” అనే సాంగ్ ఎంత వైర‌ల్ అయిందో తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌, ప్రతి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు, డ్యాన్స్ వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్న పిల్ల‌ల నుండి పండు ముస‌లి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ పాట‌కి కాలు క‌దుపుతూ అద‌ర‌గొడుతున్నారు. 

తాజాగా ఓ వృద్ధురాలు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ పాట‌కి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టింది. ఇప్పుడు ఈమెకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. వృద్ధురాలి జోష్ చూసిన ప్రముఖ యాంకర్ సుమ కూడా ఆమెతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేయ‌డం విశేషం. ప్ర‌తి ఒక్క‌రు బామ్మ డ్యాన్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే, ఈ బామ్మ మ‌రెవ‌రో కాదు. బామ్మ పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన మణి.

ఇక‌, ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల స్టెప్పులకు యూత్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది.


Viral Vayyari Song
Sreeleela
Junior movie
Ammamma dance
Rajamouli
Gali Janardhan Reddy
Kiriti Reddy
Devi Sri Prasad

More Telugu News