Hasin Jahan: మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదు

Mohammed Shamis wife Hasin Jahan booked for attack
  • పక్కింటి వారిపై దాడికి దిగిన జహాన్, ఆమె కూతురు
  • వైరల్ అవుతున్న వీడియో
  • హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ కు భారీ షాక్ తగిలింది. ఆమెపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా సూరిలో పక్కింటి వారిపై దాడికి దిగిన ఘటనలో ఈ కేసు నమోదయింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

హసిన్ జహాన్, ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షి జహాన్ పై బీఎన్ఎస్ కింద హత్యాయత్నం, దాడి, ఇతర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. 

మరోవైపు, ఇటీవలే జహాన్ కు నెలకు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. ఇందులో జహాన్ కు రూ. 1.5 లక్షలు, కూతురుకి రూ. 2.5 లక్షలు అని కోర్టు తెలిపింది.
Hasin Jahan
Mohammed Shami
Hasin Jahan attack case
Arshi Jahan
Birbhum district
West Bengal police
Kolkata High Court
Domestic Violence case

More Telugu News