Tirumala: అలిపిరి జూపార్క్ రోడ్డు వద్ద హడలెత్తించిన చిరుత

Leopard Creates Panic at Alipiri Zoo Park Road in Tirumala
  • తెల్లవారుజామున 5.30 గంటలకు చిరుత సంచారం
  • జూపార్క్ నుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వైపు వెళ్లిన వైనం
  • భయంతో పరుగులు పెట్టిన భక్తులు
తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. అక్కడినుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లి చక్కర్లు కొట్టింది. చిరుతను చూసిన భక్తులు పరుగులు పెట్టారు. చిరుత సంచరించిన ఫుటేజీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
Tirumala
Alipiri
Leopard
Tirumala Leopard
Alipiri Zoo Park
Tirupati
Wildlife
Andhra Pradesh

More Telugu News