Rajeev Shukla: బ్రిటన్ రాజుకు పుస్తకం కానుకగా ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు... సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు!

Rajeev Shukla Presents Book to King Charles III Sparks Social Media Outrage
  • ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు
  • బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో బ్రిటన్ రాజు చార్లెస్ 3ని మర్యాదపూర్వక కలిసిన వైనం 
  • బ్రిటన్ రాజుకు ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన రాజీవ్ శుక్లా
  • ఈ పుస్తకాన్ని చదివేందుకు బ్రిటన్ రాజు ఎంతో ఆసక్తి చూపించారన్న రాజీవ్ శుక్లా 
బ్రిటన్ రాజు చార్లెస్ 3కి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బహుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు బ్రిటన్ రాజు చార్లెస్ 3ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా రచించిన ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ పుస్తకాన్ని చార్లెస్ 3కి బహుమతిగా అందజేశారు. 1947లో దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రాజీవ్ శుక్లా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ విషయాన్ని శుక్లా తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకుంటూ, పుస్తకాన్ని చదవడానికి బ్రిటన్ రాజు ఎంతో ఆసక్తి చూపించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కొందరు రాజీవ్ శుక్లాను విమర్శిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కానుకకు బదులుగా మన కోహినూర్ వజ్రాన్ని తీసుకురండి అని కొందరు కామెంట్ చేయగా, బ్రిటీషర్లు మిగిల్చిన మరకలను ఆ దేశ రాజుకే చూపిస్తున్నారా, ఇది చరిత్రలో గొప్ప మీమ్‌గా నిలిచిపోతుంది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. 
Rajeev Shukla
BCCI
King Charles III
Scars of 1947
India Partition
Social Media
Kohinoor Diamond
England
Book Presentation

More Telugu News