Uttam Kumar Reddy: టెలీమెట్రీలకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Andhra Pradesh Agrees to Telemetry Says Telangana Minister Uttam Kumar Reddy
  • రిజర్వాయర్లు, కెనాళ్ల వద్ద టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తామని ఏపీ చెప్పిందని వెల్లడి
  • యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పిందన్న మంత్రి
  • గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని విమర్శలు
అన్ని రిజర్వాయర్లు, కాలువల వద్ద టెలీమెట్రీలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీలను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని ఆయన అన్నారు.

కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు. టెలీమెట్రీల ఏర్పాటుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Uttam Kumar Reddy
Andhra Pradesh
Telangana
Telemetry
Krishna River

More Telugu News