Eknath Shinde: అసెంబ్లీ ఆవరణలో టెస్లా కారు నడిపిన ఏక్ నాథ్ షిండే

Eknath Shinde drives Tesla in Assembly premises
  • ముంబైలో షోరూమ్ ఓపెన్ చేసిన టెస్లా
  • షోరూమ్ ప్రారంభం కావడం సంతోషకరమన్న షిండే
  • మహారాష్ట్ర ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మారిందని వ్యాఖ్య
ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఈరోజు టెస్లా కారును నడిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన కారును స్వయంగా డ్రైవ్ చేశారు. 

టెస్లా కంపెనీ ముంబైలో తన షోరూమ్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ... ముంబైలో టెస్లా కంపెనీ షోరూమ్ ప్రారంభించడం సంతోషకరమైన విషయమని చెప్పారు. మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో గొప్ప మౌలికసదుపాయాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని... తమ రాష్ట్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మారిందని చెప్పారు.
Eknath Shinde
Tesla
Tesla car
Maharashtra
Elon Musk
Mumbai
Electric vehicles
Auto industry
Investment Maharashtra
Assembly

More Telugu News