Devi Sri Prasad: ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్‌ను కాపీ కొట్టిన విదేశీయులు.. ఇదిగో వీడియో!

Turkish Singer Atiye Copies Devi Sri Prasads Oo Antava Song
  • మ‌న‌ సాంగ్ మ్యూజిక్‌ను కాపీ కొట్టిన టర్కిష్ సింగర్ అతియే
  • ‘అన్లయినా..’ అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్‌
  • దీంతో ఈ వీడియోపై మ‌క్కీకి మ‌క్కీ దింపేశారంటూ నెటిజ‌న్ల కామెంట్స్
హాలీవుడ్ సినిమాల తాలూకు స్టోరీ, మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ ద‌క్షిణాది, ఉత్తరాది టెక్నీషియ‌న్ల‌పై అప్ప‌ట్లో బాగా విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు దేవి శ్రీ సంగీతం అందించిన‌ ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్‌ని విదేశీయులు కాపీ కొట్టారంటూ ఆయ‌నే స్వ‌యంగా పేర్కొన‌డంతో ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో డీఎస్‌పీ మాట్లాడుతూ.. "నేను స్వ‌రాలు స‌మ‌కూర్చిన‌ ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్ ని ఎవరో కాపీ కొట్టారు. వాళ్ల మీద కేసు వేయాలా? ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నాను" అని అన్నారు. అయితే, మ‌న తెలుగు పాట‌ను కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉంద‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. 

దాంతో ఈ పాట‌ను ఎవ‌రు కాపీ కొట్టారా? అని అప్ప‌టి నుంచి నెటిజట్లు తెగ వెతికారు. ఈ క్ర‌మంలో ఏడు నెల‌ల క్రితం ట‌ర్కిష్ సింగ‌ర్ మ‌న పాట‌ని కాపీ కొట్టిన‌ట్టు తేలింది. టర్కిష్ సింగర్ అతియే ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్ మ్యూజిక్‌ను కాపీ కొడుతూ ‘అన్లయినా..’ అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్‌ను చేశారు. ఈ పాట‌ అచ్చం మ‌న సాంగ్ మాదిరిగానే ఉంది. దీంతో ఈ వీడియోపై నెటిజ‌న్లు తెలుగు పాట‌ను మ‌క్కీకి మ‌క్కీ దింపేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాపీ కొడితే కొట్టావు కనీసం క్రెడిట్స్ అయిన ఇవ్వాలి క‌దా అని అంటున్నారు. ప్ర‌స్తుతం రెండు పాట‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 


Devi Sri Prasad
Oo Antava
Oo Antava song copy
Turkish singer Atiye
Dil Raju
DSP music
Anlayana Turkish song
Samantha Ruth Prabhu
Bollywood music plagiarism

More Telugu News