Mithun Reddy: మిథున్ రెడ్డికి భారీ షాక్... లుకౌట్ నోటీసులు జారీ

Mithun Reddy Faces Setback Lookout Notice Issued
  • లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి
  • ముందస్తు బెయిల్ పిటిషన్ ను నిన్న కొట్టేసిన హైకోర్టు
  • దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా... ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Mithun Reddy
YSRCP
YSR Congress
Liquor Scam
Andhra Pradesh Police
Lookout Notice
AP High Court
Anticipatory Bail

More Telugu News