Varudu Kalyani: టీడీపీ ఉన్మాదులను తయారు చేస్తోంది: వరుదు కల్యాణి

Varudu Kalyani Slams TDP Over Attack on ZP Chairperson
  • ఉప్పాల హారికపై దాడికి నిరసనగా వైసీపీ మహిళా విభాగం నేతల ధర్నా
  • మహిళపై దాడి జరిగితే హోం మంత్రి స్పందించలేదని విమర్శ
  • చంద్రబాబు సర్కార్ కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య
కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ వైసీపీ మహిళా విభాగం నేతలు విజయవాడలో ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. 

ఈ సందర్భంగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ... మహిళపై దాడి జరిగితే హోంమంత్రి అనిత స్పందించలేదని విమర్శించారు. మహిళలపై దాడి చేసే వారికి అదే చివరి రోజన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడని ప్రశ్నించారు. జడ్పీ ఛైర్మన్ పక్క నియోజకవర్గంలో పర్యటించకూడదా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్మాదులను తయారు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
Varudu Kalyani
TDP
YSRCP
Andhra Pradesh Politics
Krishna District
Uppala Harika
Chandrababu Naidu
Pawan Kalyan
Political Violence
Telugu Desam Party

More Telugu News