Anand Deverakonda: కుర్రహీరోల కబురేది? కొత్త సినిమాల జాడేది?

Young Heros Special
  • ఆనంద్ దేవరకొండకి కలిసిరాని 'బేబి'
  • కనిపించని బెల్లంకొండ గణేశ్ సందడి 
  •  విలన్ గా కనిపించే ఆలోచనలో మేఘాంశ్ 
  • జోరు తగ్గించిన కుర్రహీరోలు

సినిమాలలో హీరోగా నెగ్గుకు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ సామాన్యుడు ప్రయత్నాలు మాత్రమే చేయగలడు .. ప్రయోగాలు చేయలేడు. అందువలన వచ్చిన పాత్రలను ఒప్పేసుకుంటూ వెళుతూ ఉంటారు. అదే సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఒక వెసులుబాటు ఉంది. నచ్చిన కథనే ఓకే చేసుకోవచ్చు .. హిట్టు పడేవరకూ తాపీగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆ తరువాత అడుగు వేయాలంటే మాత్రం ఆడియన్స్ ఆమోద ముద్ర ఉండవలసిందే. ఫ్యామిలీ నుంచి ఒకరు సినిమా ఫీల్డ్ కి వెళ్లి సక్సెస్ అయితే, ఆ తరువాత వారు కూడా ఆ మార్గం దిశగా అడుగులు వేయడం సహజం. అలా వచ్చిన హీరోగా ఆనంద్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ముందుగానే కొంత క్రేజ్ సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ, 'దొరసాని' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, అక్కడి నుంచి గ్యాప్ రాకుండా ముందుకు వెళ్లాడు. 'బేబి' సినిమాతో హిట్ కొట్టాడుగానీ, ఆ క్రెడిట్ అంతా హీరోయిన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. తరువాత ప్రాజెక్టులుగా ఏమేం లైన్లో పెట్టాడో తెలియదు. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడదామని అనుకుంటున్న సమయంలోనే, ఆయన తమ్ముడు గణేశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 'స్వాతిముత్యం' .. 'నేను స్టూడెంట్ సర్' .. సినిమాలు చేశాడు. కుర్రాడు కుదురుగా బాగానే ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ తరువాత ప్రాజెక్టులను గురించిన సందడి కనిపించడం లేదు. ఇక శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా హీరోగా 'రాజ్ దూత్' తోనే సరిపెట్టాడు. కుర్రాడి పర్సనాలిటీ .. లుక్ చూస్తే, యంగ్ విలన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి మరి.
Anand Deverakonda
Vijay Deverakonda
Dorasani
Baby movie
Bellamkonda Ganesh
Swathi Muthyam
Nenu Student Sir
Meghamsh Srihari
Rajdoot movie
Telugu cinema

More Telugu News