నిర్బంధాల మధ్య పండుగలు నిర్వహించవద్దు: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద సమస్యలను తలసాని దృష్టికి తీసుకొచ్చిన భక్తులు
  • నిర్బంధాల మధ్య పండుగలు నిర్వహిస్తే భక్తులు ఇబ్బంది పడతారన్న తలసాని
  • తాము బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించామని వ్యాఖ్య
నిర్బంధాల మధ్య పండుగలను జరపడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద తాము ఎదుర్కొన్న సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధాల మధ్య పండుగలు, జాతరలను నిర్వహించడం వల్ల భక్తులు ఇబ్బంది పడతారని చెప్పారు. 2014 నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా, అసౌకర్యాలకు గురికాకుండా బోనాలను సంతోషంగా జరుపుకునే విధంగా తాము అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించామని చెప్పారు. పలారం బండి ఊరేగింపులో చాలా ఆటంకాలు జరుగుతున్నాయని... అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని కోరారు.


More Telugu News